4 April, 2026 | 2:10 AM

నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

04-04-2026 12:46 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): నారాయణపూర్ రిజర్వాయర్ క్రింద ఇండ్లు కోల్పోయి పరిహారం మంజూరైన లబ్ధిదారులు సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. పరిహారం మంజూరు చే యించిన ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేసిన నారాయణ పూర్ ముంపు బాధితులు గంగాధర మండ లం నారాయణపూర్ రిజర్వాయర్ క్రింద ముంపునకు గురవుతున్న నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకొని న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. నారాయణపూర్ రిజర్వాయర్ క్రింద ఇండ్లు కోల్పోయి, పరిహారం మంజూరైన లబ్ధిదారులు శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే ను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నారాయణపూర్ గ్రామస్తులను దశలవారీగా ఆదుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి గ్రామస్తులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. 15 రోజుల్లో నారాయణపూర్ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడుతామని తెలిపారు. రిజర్వాయర్ క్రింద ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామడుగు మల్లేశం, బాబు మల్లేశం,బుర్ర కిరణ్, గడ్డం కార్తిక్, రాగుల మల్లయ్య,నరాల శ్రీనివాస్,లోకిని తిరుపతి ,బాబు నవిన్ తదితరులు పాల్గొన్నారు.