సీఎం సొంత జిల్లా నుంచే యాదవుల తిరుగుబాటు
యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి
నల్లమల్ల అడవిలో గొర్రెల కాపరులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్
అచ్చంపేట మార్చి 3: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే యాదవుల తిరుగుబాటు యుద్ధం ప్రారంభమైందని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాద వ్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని టీఎన్జీవో భవనంలో యాదవ జేఏసీ చైతన్య సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లమల్ల ప్రాంత అడివిని గొర్రెల మేత కోసం గొర్రెల కాపరులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రములో యాదవులపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పించాల న్నారు. నామినేటెడ్ పదవులల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. 5వేల కోట్ల తో యాదవ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. కోకాపేటలో ఏర్పాటు చేస్తున్న యాదవ భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. రెండున్నర ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు.
కార్యక్రమంలో యాదవ జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివశంకర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కాశీం యాదవ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు నారమోని నరేష్ , స్టేట్ మీడియా కన్వీనర్ ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాశన్న, శీలం వెంకటేష్, సత్తయ్య, నియోజకవర్గం అధ్యక్షుడు అజయ్, మహేశ్ , సాయి, జిల్లా మీడియా ఇంచార్జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




