బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది
మహబూబ్ నగర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి) : బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూ వస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ సాయుధ రైతాం గ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు దొడ్డి కొమురయ్య వర్ధంతి,జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్..శ్రీనివాస్ యాదవ్ లు కెసిఆర్ ని కోరితే వెంటనే అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. బీసీలకు..కుర్వ..గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని కేవలం రూ 7 కోట్లలోపు నిధులు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయని తెలిపారు.
శాసన సభలో రేవంత్ ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీసినట్టు పేర్కొన్నారు. యాదవులకు గోర్లు ఇస్తామని, నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. కనీసం మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.




