10 July, 2026 | 2:38 PM

దున్నపోతుల గండిని త్వరగా పూర్తి చేస్తాం

20-10-2024 01:36 AM

* మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

నల్లగొండ, అక్టోబర్ 19 (విజయక్రాంతి): అడవిదేవులపల్లి మండలానికి సాగు నీరందించే దున్నపోతుల గండి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అడవిదేవులపల్లి లోని రైతువేదికలో ప్రజాపాలన దరఖాస్తులపై శనివారం అధికారులతో ఆయన సమీ క్ష నిర్వహించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండలంలో చాలామంది రైతుల భూములకు పట్టాలు లేవని తమ దృష్టికి వచ్చిందని, సర్వే నిర్వహించి అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, రాష్ట్ర నాయకుడు స్కైలాబ్‌నాయక్ పాల్గొన్నారు.