03-02-2026 01:01:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి2 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కపూర్ శ్రీ కోదండ రామాల యంలో సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వినాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు ఇప్ప నాగరాజు, చిలువేరు వెంకన్న, రాపర్తి రవీందర్, చిలుకూరి శైలజా రవి, మాజీ సర్పంచ్ సరస్వతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.