calender_icon.png 3 February, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ

03-02-2026 01:02:07 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఫిబ్రవరి2 (విజయ క్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో పాటు సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాలను పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. హరిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి తహసిల్దార్లు, బూత్ స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదాబైనమా దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.