calender_icon.png 3 February, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలు అందించే పుస్తకం ఘంటారావం

03-02-2026 01:00:37 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో  రవీంద్రభారతిలో జరిగిన గంట మనోహర్ రెడ్డి రచించిన ‘ఘంటారావం’ పుస్త క పరిచయ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి న తెలంగాణ సాహత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నమోజు బాలాచారి మాట్లాడుతూ గంటా మనోహర్ రెడ్డి  ఘంటారావం పేరుతో  సమాజంలో జరిగే విషయాలు భారతంలో,

భాగవతంలో రామాయణంలోని విషయాలను కళ్ళకు కట్టినట్లు నేటి సమాజానికి ఉపయోగపడేట్లు రాస్తున్న కవిత్వం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. జయరాములు, ఆచార్య గౌరీ శంకర్, డాక్టర్ రాధా కుసుమ, నిర్వాహకులు బడే సాబ్, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి, చంద్ర ప్రకాష్‌రెడ్డి, సరోజినీ,  సత్యనారాయణ, జెవి కుమార్ పాల్గొన్నారు.