6 April, 2026 | 2:23 AM

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం

06-04-2026 12:40 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): హనుమకొండ 58వ డివిజన్ పరిధి ఎన్జీవోస్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్యలను, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. డివిజన్ల వారిగా పర్యటన చేపట్టి నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.

అన్ని శాఖల అధికారులు నేరుగా ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని, ప్రజల సహకారంతో ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎం.డి నేహాల్, కరాబ్ రాజేశ్వరరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల సమ్మయ్య, తాళ్లపల్లి మేరీ, తాళ్లపల్లి రవీందర్ (జెకె), తాళ్ల పెళ్లి విజయ్, కాంగ్రెస్ శ్రేణులు తాళ్లపల్లి ప్రసన్నకుమార్, రిషి, స్వాతి, కాలనీవాసులు లక్ష్మీనారాయణ, రవిచంద్ర, వెంకటేశ్వర్లు, ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.