05-07-2025 12:00:00 AM
ప్రభుత్వ విద్యారంగ బలోపేతంకోసం పోరాటాల తీవ్రతను పెంచుతాం
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు షాహెద్, అజిత్
జిల్లా నూతన కమిటీని ప్రకటించిన సంఘం రాష్ట్ర నాయకులు ఫహీమ్
భద్రాద్రి కొత్తగూడెం జులై 4 (విజయ క్రాంతి): మహాసభ తీర్మానాలపై మిల్టెంట్ పోరాటాలను చేపడతామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ కే సాహిద్, వర్క్ అజిత్ స్పష్టం చేశారు. శుక్రవారం కొత్తగూడెం శేషగిరిభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బకాయి ఉపకారవేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం పేద వి ద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ విద్యకు దూరం చేస్తోందని, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను గెంటి వేసే పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ప్రధానమైన ఉపకార వేతనాల సమస్యతో పాటు ఇతర తొమ్మిది అంశాలపై మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని, ఈ తీర్మానాల సాధన కోసం జిల్లా వ్యాపితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రధానంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ అమలు, సంక్షేమ హాస్టళ్లు, వసతిగృహాల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ విద్య సంస్థల బలోపేతం, ఖాళీల భర్తీ, సొంత నూతన భవనాలు, ప్రెవేటు విశ్వ విద్యాలయాల అనుమతుల రద్దు, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. ఏఐఎస్‌ఎఫ్ చేపట్టబోయే ఉద్యామాలు విద్యార్థులు సహకరించాలని కోరారు.