calender_icon.png 5 July, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న యోగ సింధూర్ విజయోత్సవ సభ

04-07-2025 10:59:55 PM

నల్గొండ టౌన్,(విజయ క్రాంతి): ఈనెల 6న హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీహబులో యోగా సింధూర్ విజయోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణను మంత్రి  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నలగొండలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరం అని ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో యోగాసిందూర్ ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా యోగా దినోత్సవం లో పాల్గొనడంతో పాటు సైనికులకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.

యోగా సింధూర్ అధ్యక్షుడు కే శివ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం జరిగే కార్యక్రమంలో యోగాలో నిష్ణాతులను సన్మానించి, విరాళాల ద్వారా వచ్చిన మూడు లక్షల 40 వేల  రూపాయలను సైనికులకు అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ సీఈవో ఎంపీ గోన రెడ్డి, యోగా సింధూర్ ఫౌండర్  డాక్టర్ యోగ నారాయణ, విద్యుత్ శాఖ ఏడి రామడుగు శ్రీధర్, యోగ గురూజీలు రాపోలు వెంకటేశ్వర్లు, సింగం ప్రవీణ్ యాలాద్రి, కంది భజరంగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.