16 March, 2026 | 4:08 AM

అసెంబ్లీని ముట్టడిస్తాం

16-03-2026 01:19 AM
  1. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్

బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందే

ఫీజులు చెల్లించకుంటే గద్దె దిగడం ఖాయం

కాంట్రాక్టర్ల పక్షమా? విద్యార్థుల పక్షమా తేల్చుకోవాలి

‘ఫీజు పోరు దీక్ష’లో అఖిలపక్ష, బీసీ సంఘాల నేతలు

ముషీరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించ కుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఉసు రు పోసుకుంటున్నదని, ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్ పెం డింగ్ నిధులు కేటాయించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ‘ఫీజు పోరు దీక్ష’ లో అఖిలపక్ష, బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. కాంట్రాక్టర్ల పక్షమా? విద్యార్థుల పక్షమా తేల్చుకోవాలని సవాల్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నదని, అదే గనుక జరిగితే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఆదివారం హైదరాబా దులోని ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ బడ్జెట్‌లో ఫీజుల రీయింబర్స్ మెంట్ విడుదల కోసం పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌తో ఫీజు పోరు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, బకాయిలు విడుదల చేస్తామని, ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయ లతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న కాంగ్రె స్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ బకాయిలు

ఇవ్వకుండా, పూర్తి ఫీజులను అమలు చేయకుండా కుట్ర చేస్తూ బడుగు విద్యార్థులను ఉన్నత విద్యకు దూ రం చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు 70 వేల కోట్లు నిధులు విడుదల చేసి వారి జేబులు నింపిందని, బడుగు విద్యార్థులకు మాత్రం 7,500 కోట్ల ఫీజుల బకాయి లు ఇచ్చేందుకు కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ఫీజులు విడుదల చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. 

ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తీవ్ర నిర్లక్ష్య వైఖరి కనబరుస్తుందని విమర్శించారు. విద్యార్థులు తలు చుకుంటే ప్రభుత్వం కూలడం ఖాయం అ న్నారు. విద్యార్థులు ఫీజుల రీయింబర్స్ మెం ట్ నిధుల కోసం చేసే ఉద్యమం చాలా న్యా యమైనదని వారికి అన్ని విధాల అండగా ఉంటానని దత్తాత్రేయ తెలిపారు.

ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పోయేకాలం దగ్గర పడ్డదని, ఫీజులు ఇవ్వకుండా కళాశాల యజమాన్యాలను రేవంత్‌రెడ్డి బెదిరించడాన్ని బట్టి చూస్తే ఆయ న ప్రభుత్వం ఎంత దివాలా కోరు ప్రభుత్వమో అర్థమవుతుందన్నారు. పేద విద్యార్థు ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి  తగులుతుందని ఈటల హెచ్చరించారు. ఎమ్మెల్సీ లు మధుసూదనాచారి, ఎల్ రమణ, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..

కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయ కుండా దొంగ నాటకలాడుతుందని, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం కనీసం బీసీ విద్యార్థుల విషయంలోనైనా బడ్జెట్ నిధులు విడుదల చేసి  ప్రభుత్వం చిత్తశుద్ధి నీ చాటుకోవాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. బీసీ సంఘా లు చేపడుతున్న ఫీజు రీయింబర్స్ మెంట్ ఉద్యమానికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సం పూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నేత జి. నర సింహ, టీజేఎస్ ఉపాధ్యక్షులు నిజ్జన రమేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్‌మాదిగ, సినీదర్శకుడు ఎన్ శంకర్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, బీసీ మహి ళా సంఘం అధ్యక్షురాలు మని మంజరి సాగర్, బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్,

బీసీయువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావులకోల్ నరేష్‌ప్రజాపతి, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి మల్లయ్య, ఓయూ జేఏసీ చైర్మన్ దేశగొని సాంబశివ గౌడ్ భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శాప శివరాములు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శంకర్, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి తరాకేశ్వరి, జిల్లెల నరసింహ, గూడూరు భాస్కర్ మేరు, బొల్లెపల్లి స్వామిగౌడ్, సంధ్యారాణి, ఇంద్రం రజక, నేనాదేవి, గుంటి మహేష్, కొప్పుల చందు గౌడ్, వెంకటేష్ గౌడ్, నాగరాజ్ గౌడ్, రాకేష్, నాగరాజుముదిరాజ్, బండి గారి రాజుగౌడ్, అంజమ్మ, పాల్గొన్నారు.