అందరికీ మంచి జరగాలి
ఎమ్మెల్సీ నాగరి కుంట నవీన్‌రెడ్డి
షాద్‌నగర్, మార్చి 15 (విజయక్రాంతి): ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలకు అంత మంచి జరగాలని గ్రామ ప్రజలకు ఎటువంటి ఆటంకాలు దరిచేరకుండా ఉండేలా హనుమంతుని యొక్క కృప అందరిపై ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో గ్రామస్తులు కౌన్సిలర్ మాధవి గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,జగన్ మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణం ఎంతో ఆవశ్యకమని అన్నారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్‌ఎస్ నాయకులు మాదారం నర్సింహా గౌడ్,మాదారం క్రిష్ణ గౌడ్,బిక్షపతి, రమేష్,వెంకటేష్,శ్రీశైలం, ఆంజనేయులు, గోపాల్ రెడ్డి, బాలయ్య,తదితరులు పాల్గొన్నారు




