2 April, 2026 | 3:05 AM

కురుమల ఆస్తులను దారాధత్తం చేస్తే సహించం

02-04-2026 01:03 AM
  1. కురుమ సంఘం ప్యానల్- 2 ప్రతినిధుల హెచ్చరిక

ఇందిరా పార్కు వద్ద కురుమ సంఘం ప్యానల్-2 ప్రతినిధుల భారీ ధర్నా

ముషీరాబాద్,ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కురుమ సంఘం ఆస్తులను ప్రైవేటు విద్యాసంస్థలకు దారాదత్తం చేస్తే సహించేది లేదని పలువురు కురుమ సంఘం ప్యానల్ -2 ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు బుధ వారం కురుమ సంఘం ప్యానల్ -2 ప్రతినిధుల ఆధ్వర్యంలో ‘దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ భవనం, కురుమ సంఘం ఆస్తులు ఆస్తులను కాపాడుకుందాం‘ అనే డిమాండ్ తో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ఈ ధర్నా కార్యక్రమానికి తెలం గాణ బీసీ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం పానల్ -2 ప్రతినిధులు దొడ్డి శ్రీనాథ్ కురుమ, చిలంపల్లి సురేష్, అడిగే సంతోష్, మాదారం కృష్ణ, జక్కుల వంశీకృష్ణ, కరిక సత్యనారాయణలు హాజరై మాట్లాడుతూ కోకాపేటలో 7.50 కోట్ల విలువైన భూమిలో తయారైన కురుమల ఆత్మ భవనాన్ని పలువురు కురుమ సంగం పెద్దలు ప్రైవేటు విద్యాసంస్థలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, దీని ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు హెచ్చరించారు.

కురుమల అభివృద్ధి కోసం నిర్మించిన ఈ భవనాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగిస్తే కురుమలు చూస్తూ ఊరు కోరని అన్నారు. కురుమల ఆస్తులను సొంత ఆస్తులుగా వినియోగించుకోవడమే కాకుం డా లక్షల మందితో కోట్లాది రూపాయలు చందాలు కట్టించి గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా దుర్వినియోగం చేసి కురుమల నోట్లో మట్టి కొట్టారని వారు ఆరోపించారు. మరో మారు కోకాపేట భూమిని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు.

కురుమల ఆత్మగౌరవ భవనాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగించే యోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వందలాది మంది కురుమ సంఘం ప్యానల్ -2 ప్రతినిధులు పాల్గొన్నారు.