25 March, 2026 | 2:08 AM

మార్చి 25న బ్లాక్ డే పాటిస్తాం

25-03-2026 12:00 AM

ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు

జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ప్రకటించిన పెన్షనర్స్ జేఏసీ                         

నిజామాబాద్ మార్చి 24 (విజయ క్రాంతి): పెన్షనర్స్ వాలిడేషన్ యాక్ట్ -2025 కు నిరసనగా మార్చి 25న బ్లాక్ డే పాటిస్తాం మనీ పెన్షనర్స్ జేఏసీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 25 న తీసుకొచ్చిన వ్యాలిడిషన్ యాక్ట్ ను నిరసిస్తూ ఈ నెల 25న బ్లాక్ డే గా పాటిస్తున్నట్లు పెన్షనర్స్ జేఏసీ జిల్లా శాఖ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్ పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.                 

మంగళవారం తేది 24 మార్నిచి 2025 న నిజామాబాద్ లో జరిగిన పెన్షనర్స్ జేఏసీ కార్యవర్గ సమావేశంలో జిల్లాకన్వీనర్ ఎల్.శ్రీధర్ మాట్లాడుతూ  ఈ చట్టం ద్వారా 2026 జనవరి 1 కన్నా ముందు రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ హెచ్చింపులు, డిఆర్, పిఆర్సి ఇవ్వాలా? వద్దా? అనే అధికారము కేంద్రం తన వద్దే పెట్టుకున్నదని ఆరోపించారు. ఎనిమిదవ పే కమిషన్ లోపెన్షన్ ప్రస్తావన లేకపోవడం శోచనీయమనిపేర్కొన్నారు. ఇదే అమలు జరిగితే పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు దేశ వ్యాప్త కార్యక్రమం లో భాగంగా రేపుమార్చి 25 న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుపు నిరసన ప్రదర్శన లో పెన్షనర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో నిజామాబాద్‌పెన్షనర్స్ జెఎసిప్రతినిధులు బన్సీలాల్, వి రాజేందర్, ముత్తారం నర్సింహ స్వామి, పి ఉమాకాంత్, ఎ సుదర్శన్,పి రమణారెడ్డి, సిహెచ్ సుకూన్,ఎం కాంతాబాయి , భానో దయ స్వామి, ఎం మురళీధర్, హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.