ఎన్ హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..
ఎమ్మెల్యే రోహిత్‌కు వినతి పత్రం సమర్పించిన ఉద్యోగులు
మెదక్, మార్చి 24(విజయక్రాంతి): మెదక్ జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రతినిధుల ములాఖాత్ లో భాగంగా మంగళవారం మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ను కలిసి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను వివరించడం జరిగింది.
నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర రాష్ట్రాలలో (7) ఏ విధంగా అయితే వారిని రెగ్యులర్ చేశారో అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఎన్ హెచ్ ఎం ఎంప్లాయిస్ అందరిని రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలనీ, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని అలాగే ఎన్ హెచ్ ఎం ఉద్యోగి మరణించినట్లయితే రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు వారి కుటుంబానికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని కోరారు.
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు జీవిత బీమా సదుపాయాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. వీటన్నింటికీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్యలను సీఎం , ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తక్షణమే తీసుకొని వెళ్లి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ ఉద్యోగులు కోట, శ్రీలత., రమేశ్, సాయిబాబా, రాజేశ్వర్, వహీద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




