8 June, 2026 | 9:51 PM

Breaking News

ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •  

చెరువులు, కుంటలను పరిరక్షిస్తాం

16-10-2024 01:39 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లిలో చెరువులు, కుంటలను పరిరక్షిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని చెరువుల, కుంటల పరిరక్షణకు కట్టుబడి ఉంటామ ని స్పష్టం చేశారు.   

తమ ప్రభుత్వం వీటిని పరిరక్షిస్తుంటే బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తున్నద న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమతకృష్ణ, నాయకులు ప్రకాశ్‌రావు, అంతటి అన్నయ్య, మహేందర్, వేగోళం అబ్బయ్య, చిలుక సతీశ్, దామోదర్ రావు, భాస్కర్, కొలిపాక సారయ్య, శ్రీనివాస్, గరిగె శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో వార్డుల్లో సీసీ రోడ్లకు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు.