18 August, 2026 | 7:59 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

మై హోమ్‌లో జాతీయ విద్యుత్ భద్రత వారం

27-06-2026 02:29 AM

మేళ్లచెరువు, జూన్ 26: స్థానిక మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జాతీయ విద్యుత్ భద్రతా వారం - 2026 ను యూనిట్ హెడ్ శ్రీ ఎన్. శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖల సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బందికి విద్యుత్ భద్రతా కరపత్రాలను పంపిణీ చేశారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ, విద్యుత్ పరికరాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత రక్షణ పరికరాల ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ నేటి అవగాహన రేపటి నివారణ అని చెప్పారు. విద్యుత్ భద్రత అనేది ప్రతి ఉద్యోగి యొక్క ప్రాథమిక బాధ్యత మరియు ప్రతి శాఖ అధిపతి తమ విభాగంలో భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అన్నారు.ఉద్యోగుల సంక్షేమానికి, ప్రమాదరహిత కార్యకలాపాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.