calender_icon.png 5 February, 2026 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ మేడారం అందిస్తాం

05-02-2026 12:00:00 AM

మంత్రి సీతక్క 

మేడారం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసిన నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో వ్యర్ధాలను పూర్తిగా తొలగించి స్వచ్ఛ మేడారం గ్రామాన్ని గ్రామస్తులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక్క ఆదేశించారు. తిరుగువారం పండగ సందర్భంగా మంత్రి సీతక్క, ము గు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తిరుగు వారం పండుగ సందర్భంగా బుధవారం సుమారు 5 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారని తెలిపారు.

మహా జాతర ముగిసినప్పటికీ, మరో వారం రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదితమైన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. 5000 మంది పారిశుద్ధ్య కార్మికులతో మేడారం పరిసరాల్లో వ్యక్ధాలను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మేడారం జాతర చుట్టు పరిసరాలను పరిశీలించి పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.