అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం
ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, మే 15. : పేదల సంక్షేమం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్‌ఆర్ ) అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో దామరచర్ల మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వివక్షత లేకుండా అర్హులకు అందిస్తామని ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
లబ్ధిదారుల నూతన దంపతుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీరావత్ స్కైలాబ్ నాయక్, సైదా నాయక్, బంటు కిరణ్, సర్పంచులు బంటు రేణుక, బెజ్జం సాయి, అధికారులు, మండల నాయకులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






