హెల్మెట్ ధరించడంతోనే ప్రాణరక్షణ
హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ
నల్లగొండ క్రైం, మే 15: హెల్మెట్ ధరించిన వాళ్ళకి ప్రాణ రక్షణ ఉంటుందని ట్రాఫిక్ సిఐ మహా లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో రహదారి భద్రతపై శుక్రవారం టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ‘రోడ్ సేఫ్టీ వీక్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా 40 ఏళ్ల లోపు ఉన్న యువత మరణిస్తున్నారని ఎక్కువగా తలకు గాయాలు తగిలే మృతి చెందుతున్నట్లు తెలిపారు హెల్మెట్ ధరించడం ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు అన్నారు.
ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఏ ఎస్ ఎం గొట్టిపర్తి యాదగిరి, మోటార్ ఏ ఎస్ ఎం నల్ల శేఖర్, సి ఎస్ ఎం ఎస్ మేడి విద్యాసాగర్, బండా అనంత్ రెడ్డి, రాసాల రామస్వామి, పగిల్ల శంకర్, వంశీ, ప్రొడ్యూసర్లు అయితగోని సత్యనారాయణ, దాసరి అనిల్, అమ్మ ఫౌండేషన్ రేఖ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






