డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం
నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆగ్రహం
గజ్వేల్, జూన్ 24: ఇంటి నిర్మాణాల విషయంలో తాము డబ్బులు డిమాండ్ చేశా మని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాం గ్రెస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు గూగులోతు రమే ష్, నరసింహా రెడ్డి, ఉపేందర్ రెడ్డి, విష్ణువర్ధ న్ రెడ్డి మాట్లాడారు.
ఇటీవల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇంటి నిర్మాణానికి సంబంధించి కౌన్సిలర్లు డబ్బులు అడిగారని కొందరు చే స్తున్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో తమ ప్రతిష్టను దెబ్బతీ యాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్ర చారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఎవరినీ డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. తాము డబ్బులు అడిగినట్లు ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే వెంటనే మా పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్లు సవాల్ విసిరారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తమను లక్ష్యంగా చేసు కుని కొందరు బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, టీపీసీసీ కార్యదర్శి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సమీర్, శేఖర్, వహీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






