1 June, 2026 | 2:37 AM

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాం !

01-06-2026 02:05 AM

ఆటో డ్రైవర్‌తో ముచ్చటించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, మే 31(విజయక్రాంతి): ఆటో డ్రైవర్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ఆటో డ్రైవర్తో జగ్గారెడ్డి ఆసక్తికర సంభాషణ చేశారు. సీఎంరేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడికి ఏం చెప్పాలని ఆటో కార్మికుడిని అడుగగా ఆటో ఛార్జీలు పెంచాలని కోరారు.

ఆటో చార్జీలు పెంచితే ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటారని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే మోదీని మనం తిడుతున్నాం కదా అని జగ్గారెడ్డి చెప్పగా, ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పిన 10 వేలు ఇవ్వమని చెప్పండి అని సమాధానమిచ్చారు. కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేశారని, లేకపోతే మీకు ఇచ్చే 10 వేల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది కాదని  జగ్గారెడ్డి తెలిపారు. ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డి మీ డబ్బులు మీ ఖాతాలో వేస్తారన్నారు. ఆటో కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.