7 April, 2026 | 11:59 AM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

అమెరికా నౌకలను ముంచేస్తాం

09-01-2026 12:00 AM
  1. అగ్ర రాజ్యానికి రష్యా హెచ్చరిక
  2. నౌకను స్వాధీనం చేసుకోవడంపై పుతిన్ సర్కార్ మండిపాటు

మాస్కో, జనవరి 8: రష్యాకు సంబంధించిన నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవ డంతో రష్యా సర్కార్ తీవ్రంగా స్పందించింది. తాము కూడా అమెరికా నౌకలను ముంచేస్తామని రష్యా హెచ్చరించింది. వెనెజువెలాతో సంబంధం ఉందంటూ, రష్యా జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్‌ను ఉత్తర అట్లాంటి క్ మహాసముద్రంలో అమెరికా బలగాలు సీజ్ చేశాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నౌకను అమెరికా సీజ్ చేయడంపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.

తాజా గా రష్యాకు చెందిన చట్టసభ్యుడొకరు ఈ ఘటనపై స్పందిస్తూ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా తీరు ఇలాగే కొనసాగితే ఆ దేశపు పడవలను కూడా ముంచేస్తామని హెచ్చరించారు. ఐస్లాండ్‌కు దక్షిణంగా 190 మైళ్ల దూరంలో ‘మారినెరా’ అనే రష్యన్ ట్యాంకర్‌ను అమెరికా రక్షణ శాఖ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా సీజ్ చేశాయి. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ కూడా సహకరించింది.

ఇదే సమయంలో, జెండాలేని ‘ఎం/ టీ సోఫియా’ నౌకను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ వీడియోను యూ ఎస్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. ఈ ఘటనపై రష్యా ఎంపీ అలెక్సీ జురావ్లెవ్ తీవ్రంగా స్పందించారు. ‘ఏం చేసినా శిక్ష పడదన్న ధీమాతో అమెరికా ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే సైనిక దాడులకు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే అమెరికా కోస్ట్‌గార్డ్ పడవలను ముంచేయాల్సి వస్తుం ది’ అని ఆయన హెచ్చరించారు.