calender_icon.png 9 January, 2026 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్, చైనాపై 500 శాతం సుంకాలు

09-01-2026 12:00:00 AM

ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం

  1. రష్యాపై ఒత్తిడి తెచ్చేలా ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్
  2. వచ్చే వారం ఓటింగ్ జరిగే చాన్స్ 
  3. రిపబ్లికన్ సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ పోస్టు

వాషింగ్టన్, జనవరి 8: రష్యా నుంచి చ మురును దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాలపై 500 శాతం సంకాలు వడ్డించేందకు అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రం ప్ సిద్ధమవుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధా న్ని ఆపేందకు  రష్యాపై ఒత్తిడి తెచ్చేలా దైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లుపై వచ్చేవారం ఓటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ బిల్లుకు సంబంధించి రిపబ్లికన్ సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ గురువారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ట్రంప్‌తో భేటీ అయ్యి అనేక కీలక అంశాలపై చర్చించినట్లు గ్రాహమ్ చెప్పారు.

రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ట్రంప్ అనుమతి ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చేవారం ఓటింగ్ నడవనుందని వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు ఇస్తున్నాయని గ్రాహమ్ ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు మాస్కో ఇంధ నం కొనుగోలు చేయకుండా ఈ బిల్లు ఆపుతుందని పేర్కొన్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రష్యాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై 500 శాతం సుంకాలు వేసే అధికారం యూఎస్‌కు ఉంటుందని చెప్పారు. ఈ బిల్లుపై వేగంగా ముందకు సాగుతామని పేర్కొన్నారు. రష్యా నుంచి ఇందనం దిగుమతి చేసుకోవడంలో చైనా అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానం లో ఉన్నాయి. ఈ ఇంధనం కొనుగోళ్లపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నా రు.

పుతిన్ యుద్ధ యంత్రానికి ఇంధనంగా పనిచేసే చౌకైన రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలను శిక్షించడానికి ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్‌ను అనుమతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గతేడాది భారత్ దిగుమతులపై ట్రంప్ అదనపు సుంకాలు వేశారు. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి భారత్ మధ్య చర్చ లు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 500 శాతం సుంకాల బిల్లుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. వరుస సుంకాల పెరుగుదల తర్వాత చైనా, యూఎస్ మధ్య సం బంధాలు కూడా క్షీణించాయి. వాషింగ్టన్ చై నా వస్తువులపై 145 శాతం సుంకం విధించగా, బీజింగ్ అమెరికన్ ఉత్పత్తులపై 125 శాతం సుంకంతో ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల, భారత్ రష్యా చమురు కొనుగోలును కొనసాగించడంపై భారతదేశంపై కొత్త సుంకాలు విధించాలని ట్రంప్ సూచించారు.