2 May, 2026 | 9:02 PM

Breaking News

25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

పాడి రైతులకు అండగా ఉంటాం

19-03-2025 01:38 AM

ధర్మారెడ్డి పల్లి లో ఉచిత పశు వైద్య శిబిరం 

 గజ్వేల్, మార్చి 18 : వ్యవసాయ రైతులతోపాటు పాడి రైతులకు అండగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అండగా ఉంటుందని ఏఎంసీ చైర్మన్  వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని  ధర్మారెడ్డి పల్లి గ్రామంలో ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్  వంటేరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు పాడి పశువులు  నెలవారి  ఆదాయ వనరుగా  మారాయి అన్నారు. అందుకే రైతులకు అండగా నిలవాలని ఉద్దేశంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రైతులు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి రమేష్ బాబు, ఏఎంసీ కార్యదర్శి  జాన్ వెస్లీ  వైస్ చైర్మన్  సర్దార్ ఖాన్  పాలక వర్గ సభ్యులు మరియు నాయకులు సుఖేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో  పశుసంవర్ధక శాఖ ఏడి  డాక్టర్ రమేష్ బాబు  సిబ్బంది 105 గేదెలు,  20 ఆవులకు  గర్భకోశ నివారణ వ్యాధి, సాధారణ జబ్బులకు   చికిత్స చేశారు.