విద్యుత్ కార్మికులకు అండగా ఉంటాం
- సర్వీస్ రెగ్యులర్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
- ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు
- సమ్మె కొనసాగిస్తాం విద్యుత్ కార్మికుల ప్రతిజ్ఞ
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేప ట్టిన విద్యుత్ కార్మికులకు అండగా ఉంటామని, కార్మికుల సర్వీస్ రెగ్యులర్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా మని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, ఒకే సర్వీస్ రూల్ అ మలు కోసం విద్యుత్ కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరిం ది.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టిసన్, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ విద్యుత్ కార్మికులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ము ఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కార్మికులకు జీవో 11 తీసుకొచ్చి ఆర్టిజ న్లుగా గుర్తించి రెగ్యులర్ జీతాలు ఇచ్చి వారి కుటుంబాలకు పెద్ద ది క్కుగా ఉన్నాడని గుర్తుచేశారు.
విద్యుత్ కార్మికుల సహకారంతో రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను కేసిఆర్ రాజును చేశాడన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు దష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కోట్లాడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 24,000 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలన్నారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు గడవక ఇప్పటి వరకు 200 మంది కార్మికులు చనిపోయారని రవీందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు మా ట్లాడుతూ విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ లో అన్ మ్యాన్ వర్కర్లను ఆర్టిజన్‌లుగా విలీనం చేయాలని, అలాగే 2016కు ముందు అర్హతలు కలిగి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రా క్ట్ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలనే డిమాండ్లను నెరవేర్చడానికి సహకరించాలని ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు.
చర్చలకు పిలవకుండా చొద్యం చూస్తున్న ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యా క్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె యధావిధిగా కొనసా గిస్తామని కార్మికులు ప్రతిజ్ఞ చేశా రు. తొర్రూర్ డివిజన్ కమిటీ చైర్మన్ పసుపులేటి మధు, టిజిఎన్పీడీసీఎల్ మహబూబాద్ జిల్లా కోకన్వీనర్ మచ్చ సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఆర్టిసన్, అన్ మ్యాన్, స్పాట్ బిల్ల ర్స్, పీస్ రేట్ కార్మికులందరి సమస్యలపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలువకుండా చోద్యం చూస్తోందని ఆరోపించా రు.
సోమవారం లేబర్ కమిషనర్‌తో రాష్ట్ర నాయకులతో నిర్వహిం చిన చర్చలు విఫలమయ్యాయన్నారు. మళ్ళీ చర్చలు 17కు వాయి దా వేశారని, జాక్ పిలుపు మేరకు సమ్మె యధావిధిగా కొనసాగిస్తామని, విద్యుత్‌శాఖలోని ట్రేడ్ యూ నియన్లు కూడా తమకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని, ఐక్యమత్యాన్ని విచ్ఛి న్నం చేసే ప్రతి కార్యక్రమాన్ని సం ఘటితంగా ఎదుర్కొంటామని కార్మికులు ప్రతిజ్ఞ చేశారు.




