కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత మొదలైంది
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం భోలక్‌పూర్ డివిజన్ రంగానగర్లో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధ్వానంగా మారిన రోడ్లను ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కంకర తేలి గుంతలమయంగా మారిన రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయా రోడ్లను మోడల్ రోడ్లుగా తీర్చి దిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేస్తున్నాం అన్నారు. స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను యుద్ధ ప్రాతిపాధికన పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం అన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, పార్టీ సీనియర్ నాయకుడు బింగి నవీన్, భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్, పార్టీ రాష్ట్ర నాయకుడు రహీం, డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.






