కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తాం
బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24: ఆపత్కాలంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తామని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రమాదవశాత్తు గాయపడిన బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకుడు పొలమోని అశోక్ గౌడ్ ను రాయపోల్ గ్రామంలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా భావించి, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పార్టీ ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపిపి కృపేష్, పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మాజీ సర్పంచ్ బల్వంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి లు అచ్చన శ్రీశైలం, సొసైటీ వైస్ చైర్మన్ ఈశ్వర్ జీ, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.






