కొత్తకోట పట్టణ అభివృధి పనులకు నిధులు మంజూరు
25-09-2025 12:37 AM
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో భారీ నిధుల మంజూరు
వనపర్తి సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి ): కొత్తకోట పట్టణ అభివృద్ధి కోసం ఎ మ్మెల్యే ప్రత్యేక చొరవతో భారీగా నిధుల మంజూరు అయ్యాయని బుధవారం మీడియాకు వివరించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం నుండి 15 కోట్ల రూపాయల మున్సిప ల్ పరిపాలన శాఖ ఆమోదం తెలిపిందనీ ఈ నిధులను నగరాభివృద్ధి ఖాతా నుండి కేటాయించగా, అభివృధి అమలు బాధ్యతను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, హైదరాబాద్,కొత్తకోట మున్సిపల్ కమిషనర్ కు అప్పగించారు. ఈ నిధులతో పట్టణ అభివృ ద్ధి పనులు పూర్తయితే కొత్తకోట రూపురేఖ లు పూర్తిగా మారనున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






