calender_icon.png 25 September, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాగింగ్ పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

25-09-2025 12:35:00 AM

ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య 

అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 24 : సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎల్బీనగర్ ఏసీపీ ఏ కృష్ణయ్య అన్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ తట్టి అన్నారంలోని శ్రేయస్ కాలేజీలో విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.   

ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కొందరు విద్యార్థులు రాగింగ్ కు పాల్పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం వేసుకుంటున్నారని అన్నారు.  విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగోలు ఇన్ స్పెక్టర్ మక్బూల్ జానీ, సబ్ ఇన్ స్పెక్టర్, కాలేజీ లెక్చరర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.