24 April, 2026 | 1:24 AM

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారి వెంటే ఉంటాం

24-04-2026 12:15 AM

మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 23(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు భారతీయ రాష్ట్ర సమితి బిఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు వారికి రావాల్సిన 30 శాతం ఫిట్మెంట్ తో పాటు 2021 వ వేతన సవరణ,ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు.

అంతే కాకుండా ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద చెల్లించాల్సిన 400 కోట్లను వెంటనే విడుదల చేయాలని కార్మికులపై ఉద్యోగ భద్రత పెంచాలని ట్రేడ్ యూనియన్ సంఘం పై నిషేధం ఎత్తివేసి యూనియన్ సంఘాలను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్ సంఘం ఎన్నికల నిర్వహించాలని,మహిళా ఆర్టీసీ కార్మికులపై ఒత్తిళ్లు తగ్గించాలని,ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలని,రోజుకు 8 గంటల వరకు విధులు నిర్వహించే విధంగా జీవో తీయాలని నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మేడ్చల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు గుండెకాయ లాంటి వారిని వారికి ఎలాంటి సమస్య వచ్చిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని భాస్కర్ యాదవ్ స్పష్టం చేశారు.మేడ్చల్ ఆర్టీసీ డిపో కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఎమ్మెల్యే ఆర్టీసీ కార్మికుల వెంటే ఉంటారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నడికొప్పు నాగరాజు.శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.