1 July, 2026 | 12:51 AM

ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటాం..

01-07-2026 12:18 AM

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, జూన్ 30: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం భూమిపూజ చేసి ప్రారంభించారు.

ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని, వారి సంక్షేమం, అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మస్జిద్లు, దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి తన సహకారం కొనసాగుతుందని, నియోజకవర్గంలోని దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానన్నారు. పెండింగ్లో ఉన్న మస్జిద్ నిర్మాణ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మస్జిద్ కమిటీ సభ్యులు, ముస్లిం సంఘాల నాయకులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు.