18 August, 2026 | 3:01 AM

అక్రమనిర్మాణాలను అడ్డుకుంటాం

18-08-2026 12:00 AM
  1. ప్రజా స్థలాల్లో నిర్మాణాలను సహించేది లేదు 
  2. కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణం తొలిగిస్తాం 
  3. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 
  4. సాహెబ్‌నగర్‌ల్లో వివాదాస్పద స్థలాల పరిశీలన 

ఎల్బీనగర్, ఆగస్టు 17 : ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలను చట్టపరంగా అడ్డుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాహెబ్నగర్ కమాన్ సమీపంలోని వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీలో సర్వే నెంబర్ 68లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 39,40 లోని 400గజాల భూమిపై వివాదం నెలకొన్నది. కాగా, ఆ స్థలంలో నూతనంగా భవ నాలను నిర్మిస్తున్నారు.

అయితే, ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఆయా స్థలాల విషయంలో ప్రొఫెసర్ బాలాజీతోపాటు ప లువురు స్థానికులు ఈ అంశంపై రెండేళ్లుగా పోరాడుతున్నారు. వీరి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన సిబ్బందితో కలిసి సోమవారం సాహెబ్నగర్ కమా న్ సమీపంలోని వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీలో పర్యటించి, అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. వివరాల్లోకి వెళ్తే... 

సాహెబ్‌నగర్ కమాన్ సమీపంలోని వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీలో 39, 40 ప్లాట్లను 1987లో అప్పటి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ప్రజా అవసరాల కోసం గిఫ్ట్ డీడ్ ద్వారా కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు సొసైటీ ఆ స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. దీంతో కొందరు ఈ స్థలాన్ని మీము కొనుగోలు చేశామని, నూతనంగా భవనాలను నిర్మిస్తున్నారు. దీనిపై రెండేండ్ల క్రితం స్థానికులు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు.

వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్మాణాలను పరిశీలించారు. ఇరువర్గాలతో మాట్లాడి, వివరాలు సేకరించారు. 

చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం 

స్థల వివాదంపై న్యాయస్థానానికి జరిగిన పరిణామాలను వివరించి, కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిర్మాణాన్ని తొలగించడం పెద్ద విషయం కాదని, అయితే న్యాయస్థానాన్ని గౌరవిస్తూ, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు

 ముందుగా మాకు న్యాయం చేయండి

- ఆరోపణలు ఎదుర్కొంటున్న జానయ్య గౌడ్ డిమాండ్,- మోసం చేశామంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. 

హైడ్రా కమిషనర్ హెచ్చరికలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న జానయ్య గౌడ్ స్పందించారు. సాహెబ్ నగర్ కలాన్ పరిధిలోని ఆఫీసర్ కాలనీలో సర్వే నెంబర్ 68, ఫ్లాట్ నెంబర్ 39, 40 లోని 400గజాల భూమిను రెండేండ్ల క్రితం పన్నేండ్ల క్రితం చేసిన గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్లు స్థలం కొనుగోలు, భవన నిర్మాణానికి ఖర్చు చేశామని తెలిపారు. ఆఫీసర్స్ కాలనీవాసులు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారని ఆరోపించారు.

విచారణ జరిపి తప్పు తేలితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవస్థ మొత్తం అధికారుల వద్దే ఉందని, సమగ్ర విచారణ జరిపి నివేదిక తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను తప్పు చేసినట్లు విచారణలో తేలితే తనపై చర్యలు తీసుకోవాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానయ్య గౌడ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో హైడ్రా అధికారులు, ఆఫీసర్ కాలనీవాసులు పాల్గొన్నారు.