27 May, 2026 | 3:00 AM

మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తాం

27-05-2026 02:01 AM

కేసముద్రం, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ అన్నారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పేదరిక సంస్థ-మెప్మా ఆధ్వర్యంలో ఓంకారేశ్వర పట్టణ సమాఖ్య సర్వసభ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెప్మా విభాగానికి సంబంధించిన ఏ సమస్య వచ్చిన వాటి పరిష్కారానికి పురపాలక సంస్థ ముందుంటుందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, సబ్సిడీలు, అందిస్తూ వారి జీవితాల్లో భరోసా కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ.శ్రీనివాసరావు, డీ ఎం సీ విజయ, అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి పూలమ్మ, కోశాధికారి శ్యామల, మున్సిపాలిటీ ఆర్పీలు, పాల్గొన్నారు.