3 August, 2026 | 5:38 PM

Breaking News

పార్టీ క్రమశిక్షణకు మారుపేరు సున్నం రాజయ్య: సీపీఎం నేతలు   •   యువత సైబర్ మోసాలకు గురి కావద్దు   •   కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •  

మాజీ మంత్రి హరీష్‌రావు దిష్టిబొమ్మ దహనం

27-05-2026 02:02 AM

కందుకూరు, మే 26 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఫార్మాసిటీ వద్దు& ఫ్యూచర్ సిటీ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకుంటామని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

పదేళ్ల పాలనలో ఒక్క మెగా ప్రాజెక్టును కూడా తీసుకురాని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం రాజకీయ దివాళాకోరుతనమని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఉద్యోగాలు, కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జంగారెడ్డి,సరికొండ మల్లేష్,కందుకూరు గ్రామ సర్పంచ్ సరికొండ పాండు, సరికొండ జగన్, బీసీ సెల్ మండల అధ్యక్షులు  దెబ్బడగూడ సర్పంచ్ మల్లెపల్లి బాలరాజ్, సాల్రా రావులపల్లి సర్పంచ్  శ్రీను నాయక్, సొసైటీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, మురళినగర్ సర్పంచ్ భాస్కర్, మాజీ సర్పంచ్ రామచందర్ రెడ్డి, సరికొండ జగన్, సీనియర్ నాయకులు ఐఎన్టియుసి మండల అధ్యక్షులు గాదే కుమార్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చారి,మైనారిటీ చైర్మన్ అసిస్, మదన పాల్ రెడ్డి,సీనియర్ నాయకులు రానా ప్రతాప్ రెడ్డి, సిరిగిరి జంగా చారి, నిమ్మ రాజశేఖర పాల్గొన్నారు.