15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వరద బాధితులను ఆదుకుంటాం

04-11-2025 12:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ 

హనుమకొండటౌన్ నవంబర్ 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్  వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల సహాయార్థం టీఎన్జీవో, టీజీవో, ట్రేస్స, జిల్లా అధికారుల వెల్ఫేర్ సంఘం, పంచాయతీ రాజ్, భగీరథ మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐటిఐ తదితర సంఘాల సహకారంతో 500 నిత్యవసర సరుకుల కిట్స్, బెడ్ షీట్స్  పంపి ణీ చేయుట కొరకు ఏర్పాటుచేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి కావలసిన నిత్యవసర సరుకులు, బెడ్ షీట్స్ అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లా డుతూ కలెక్టర్ టీఎన్జీవో, టీజీవో నేతలను పిలిచి మన వంతుగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు సహాయం అందించాలని కోరడంతో వెంటనే ఉద్యోగులు మనస్ఫూర్తిగా ముందు కు వచ్చారని పేర్కొన్నారు.

టీఎన్జీవో యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్, టీజీవో అధ్యక్షులు ఆకవరం శ్రీనివాస కుమార్, సహకార శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమనేని జగన్మోహన్రావు, డిఆర్డిఓ పిడి మేన శ్రీనివాస్, ట్రేస్సా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, కాజీపేట ఎమ్మార్వో బావూసింగ్, ఆసనాల శ్రీనివాస్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు డాక్టర్ ప్రవీణ్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేష్, పోలురాజు, దాస్య నాయక్, రాజ్యలక్ష్మి , ఎంపిడిఓ ల సంఘం కూతురు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ ల సంఘం రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.