17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

విద్యార్థులకు షూస్ పంపిణీ

04-11-2025 12:00 AM

మరిపెడ, నవంబర్3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ సీతారాంపురం పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. పోలీసులంటే కర్కాశం పోలీసులంటే కఠిన్యం. వీరికి మనసే లేదంటారు.కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఇప్పటికే చాలామంది పోలీసులు నిరూపిస్తున్నారు .

ఆదర్శంగా నిలుస్తున్నారు. అవును పోలీస్ శాఖలు అందరూ ఒకేలా ఉండరు మానవత్వం ఉన్నవాళ్లు కూడా ఉంటారు ఇదే విషయాన్ని నిరూపించారు మరిపెడ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ తన వేతనంలో అంత మొత్తాన్ని నిరుపేద పిల్లలకు షూస్ కొనిచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.

మరిపెడ మండల కేంద్రంలో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజకుమార్ మున్సిపాలిటీ కేంద్రం సీతారాంపురం  పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద పిల్లలకు 130 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో షూస్ తెప్పించి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి పేదలకు తన శక్తి మీద సహాయం చేయడమే తన లక్ష్యమని పేద విద్యార్థులు విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కొనసాగిస్తానని మడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ తెలిపారు.