calender_icon.png 4 November, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల వలయంలో తిమ్మంపేట గ్రామం

04-11-2025 12:00:00 AM

-తిమ్మంపేటలో పడకేసిన   పారిశుధ్య పనులు 

-సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ప్రజల 

-గ్రామంలో బ్లీచింగ్ ఫాగింగ్ కరువు 

-పట్టించుకోని ప్రత్యేక పాలన అధికారులు

ములుగు, మంగపేట, నవంబరు3 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామ పంచాయతీలో పారుశుధ్యం పనులు పాడకేసిం దని తిమ్మంపేట గ్రామ గ్రామపంచాయతీలో ఎటు చూసిన సమస్యలే సమస్యలే అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దంతనపల్లి నరేందర్ అన్నారు తిమ్మంపేట గ్రామ పంచాయతీ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనతో పారిశుద్ధ్య పనులు పడకేసాయి.

ప్రజలకు మౌలిక సదుపాయాలైన తడిచెత్త పొడిచేత్త సేకరణ, డ్రైనేజీలు శుభ్రపరచడం, వీధిలైట్ల నిర్వహణలో పూర్తిగా విఫలం గ్రామంలో ఏ చెత్తకుండి దగ్గర చూసిన పడేసిన వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి.ఇందుకు కారణం ప్రతిరోజు చెత్త సేకరణ చేయకపోవడం సైడ్ కాలువలో చెత్తతో నీరు నిలవడం వల్ల వచ్చే దుర్వాసన భరించలేక పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.

గ్రామంలో డ్రైనేజీల పరిస్థితి దయనీయంగా మారడంతో జనం దోమలతో వేగలేకపోతున్నారు.డ్రైనేజీలలోని మురుగు నీటి కారణంగా దోమల బెడద అధికమవుతోంది.ఒకవైపు వర్షాకాలం వచ్చి సీజనల్ వ్యాధులు డెంగీ మలేరియా టైఫాయిడ్ తదితర వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామంలో కనీసం బ్లీచింగ్ చల్లించడం, ఫాగింగ్ (దోమల నియంత్రణ పొగ) పిచికారి చేయడంలాంటివి మరచారు.ఇలాంటి సమస్యలతో ప్రజలు సతమతమైన పాలకులకు, అధికారులకు పట్టింపు లేదు. 

నెలలు గడుస్తున్నాయి..

తిమ్మంపేట గ్రామంలో డ్రైనేజీలు శుభ్రం చేయకనెలలు గడుస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త చెదారం, సైడ్ కాలవలలో అయితే ఏపుగా పెరిగిన చెట్లు వాటి వల్ల కాలువలో మురుగునీరు నిలిచిపోయి భరించలేని వాసన వస్తుంది. దీనికి తోడు దోమలు వాటి వల్ల మాకు రోగాలు ఎప్పుడు వస్తాయో అనే భయంతో బతుకుతున్నాము.

 దంతనపల్లి నరేందర్ , తిమ్మంపేట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు