బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం
మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి) : గత రెండు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాల ధాటికి ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడకు చెందిన జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇంటి గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ జేబ షేక్ వెంటనే స్పందించి మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్‌లకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పురపాలక పాలకవర్గం అధికారులు గురువారం దెబ్బతిన్న లక్ష్మి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బాధితురాలికి కొండంత భరోసా
ఇంటి గోడలు కూలిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న జూలాల లక్ష్మిని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్, అధికారులు ఓదార్చి ధైర్యం చెప్పారు. వర్షాల వల్ల నష్టపోయిన ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, అలాగే ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బీన్ అహ్మద్, బీఆర్‌ఎస్ నాయకులు సమద్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






