23 July, 2026 | 4:14 PM

కాంగ్రెస్ పార్టీ ధర్నా

23-07-2026 03:43 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని/కాంగ్రెస్ పార్టీ ధర్నా

రుద్రంగి జులై 23(విజయాక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి బిజెపి పార్టీ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ.ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు.

నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే పేపర్ లీకేజీలు చోటుచేసుకుని లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై పోలీసులతో బలప్రయోగం చేయించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ,మార్కెట్ చెర్మన్ చేలుకల తిరుపతి,ఉప సర్పంచ్ మడిశెట్టి అభిలాష్,గడ్డం శ్రీనివాస్,పల్లి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు