05-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, జూలై 4 ( విజయక్రాంతి ) : భారత్ మాలా రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అ న్నారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయిన అయి జ మండలం బింగిదొడ్డి, జడ దొడ్డి గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రైతుల నుంచి ప్రత్యక్షంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భూములు కోల్పోయిన ప్రతి రైతుకూ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.నష్టపరిహారాన్ని పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చలు జరుపుతున్నామ ని,తగిన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రైతులు సర్వీస్ రోడ్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు, కలెక్టర్ స్పందిస్తూ,సర్వీస్ రోడ్ అంశాన్ని మళ్లీ పరిశీలించి, అవసరమైతే మార్పులు చేసి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.రైతుల వల్లే ఈ ప్రాజెక్టు ఈ స్థాయికి చేరుకుందని,వారి సహకారం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం అందిస్తే,మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.