calender_icon.png 5 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

04-07-2025 11:28:28 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): హైదరాబాదులో శుక్రవారం నిర్వహించే జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి నాయకులు గైని శివాజీ, రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి,సంజీవులు, రాజు, సుధాకర్ రావు, భూషణం తదితరులు పాల్గొన్నారు.