05-07-2025 12:00:00 AM
నిర్మల్ జూలై 4 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు శుక్రవారం కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమా ర్, వివిధ శాఖల జిల్లా అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా రోశయ్య సేవలు నిరూపిత మైందని, ఒక నిస్వార్థ సేవాభావంతో కూడిన నాయకుడు. పదవులు కోసం కాక, పరిపాలన కోసం జీవించిన మహనీయుడన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ నాయకుడిగా ఎదిగిన రోశయ్య, స్వచ్ఛత, పరిపాలనలో నిబద్ధతకు గుర్తుగా నిలిచారన్నా రు.
ఆయన పాలన అనుభవం, ఆర్థిక మేధస్సు, రాజకీయ నైపుణ్యం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల చరిత్రలో చిరస్మర ణీయంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు నరసింహ రెడ్డి, రమణ, సరోజ, విష్ణువర్ధన్, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.