తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పి కొడతాం
మహబూబాబాద్, జులై 19 (విజయక్రాంతి): హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, తెలంగాణ ఆస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఏ రాజకీయ పార్టీ ఆలోచన చేసినా మరో తెలంగాణ ఉద్యమం అనివార్యమని రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి అన్నారు.
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ అధ్యక్షతన మహబూబాబాద్ లో నిర్వహించిన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలనే డాక్టర్ అంబేద్కర్ నాటి ఆలోచనలకూ, నేటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రాజకీయ స్వలాభంకోసం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణ తలలేని మొండెంగా మారుతుందన్నారు.
తెలంగాణ పై ఇంకనూ సాంస్కృతిక దాడి జరుగుతూనే ఉందని, తెలంగాణ కు 60 శాతం ఆదాయం సమాకురుస్తున్న హైదరాబాద్ ను యూ టీ గా మారితే తెలంగాణ అభివృద్ధి జరగదని తెలిపారు. ఆస్తిత్వ వాదానికి, ప్రాంతీయ వాదానికి తేడాతెలుసుకొని ఆయా రాజకీయ పార్టీలు ప్రవర్తించాలని, ఓట్ల కోసం హైదరాబాద్ ను ఆగం చేయవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బీ.కొండల్ రెడ్డి, ఐటీ ప్రొఫెసనల్ రణధీర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జే ఏ సీ నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మార్ని నేని వెంకన్న, స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, ఎం సిపిఐ జిల్లా నాయకులు కంచ వెంకన్న, న్యూడెమోక్రసీ నాయకులు అలకుంట్ల సాయిలు, జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కవిత, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి, టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, జిల్లా నాయకులు. బాలస్టీ రమేష్, విష్ణు వర్ధన్ రెడ్డి, రాచకొండ ఉపేందర్, సోమరాపు ఐలయ్య,
ప్రముఖ కళాకారులూ కోమిరే సాకి, ఆర్టీసీ నాయకులు పట్టాభి లక్ష్మయ్య, పిడిఎస్యు నాయకులు బోనగిరి మధు, తెలంగాణ విద్యార్ధి నాయకులు చిత్తారి సోమన్న, ఎల్ హెచ్ పీ ఎస్ నాయకులు బోడ లక్ష్మణ్, రిటైర్డ్ ఉపాధ్యాయులు, బద్రి నారాయణ, యాదగిరి, షేక్ జానీ, సోమ విష్ణు వర్ధన్, హలవత్ లింగ్యా, నాయకులు సామ పాపయ్య, బట్టు చైతన్య, ఆటో యూనియన్ నాయకులు నలమాస సాయి తదితరులు పాల్గొన్నారు.






