calender_icon.png 16 September, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

16-03-2025 08:08:06 PM

రైతన్నల పంట పొలాలను ఏండనివ్వం..

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..

పెద్దపల్లి (విజయక్రాంతి): చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తామని, రైతన్నల పంట పొలాలను ఏండనివ్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు రైతులకు భరోసా ఇచ్చారు.  చొప్పదండి మండల మీదుగా ఉన్న రేవేల్లె కెనాల్ ను సందర్శించి పెద్దపల్లి నియోజకవర్గానికి సాగు నీరందించడానికి కెనాల్ నీటిని పరిశీలించి, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పెద్దపల్లి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు రైతుల పంట పొలాలకు నిక్కచ్చిగా సాగునీరు అందించాలని ఎమ్మెల్యే విజయరమణ రావు అధికారులను ఆదేశించారు. అనంతరం కెనాల్ నీటి పారుదలకు సంబంధించిన లాగ్ పుస్తకాలను పరిశీలించి నీటి పారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రంగాపూర్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామంలో రూ. 25 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లకు స్థానిక నాయకులతో కలిసి  ఎమ్మెల్యే విజయరమణా రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంట రమేష్, ఎనగందుల ప్రదీప్, అరె సంతోష్, ఆడెపు వెంకటేష్, కలవేనా నరేందర్, బొడ్డుపల్లి అశోక్, సతీష్, సారయ్య గౌడ్, సతీష్ గౌడ్, శంకర్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.