24 March, 2026 | 4:09 AM

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

24-03-2026 12:48 AM

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య

కోదాడ, మార్చి 23 :  పెన్షనర్ల సమస్యల సాధనకై  నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యను కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల శ్రేయస్సు కోసం వారి హక్కుల సాధనకు  తన శక్తి మేరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు.

ఈ సందర్భంగా సీతారామయ్య దంపతులను జిల్లా  వివిధ మండలాల శాఖల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జాస్తి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి  తమ్మన బోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షులు వి జానయ్య, ఉపాధ్యక్షులు యస్దాని, భ్రమరాంబ, సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి హాజీ నాయక్,  పాల్గొన్నారు.