24 March, 2026 | 2:30 AM

మిర్యాల వారాంతపు సంత వేలం ఖరారు

24-03-2026 12:50 AM

14 లక్షలకు దక్కించుకున్న యామగాని రమేష్

నూతనకల్, మార్చి 23: మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంత నిర్వహణ హక్కుల కోసం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీవో శశికల, సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు.ఈ వేలం ప్రక్రియలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనగా, తీవ్ర పోటీ నడుమ అదే గ్రామానికి చెందిన యమగాని రమేష్ రూ. 14,00,000 (పద్నాలుగు లక్షల రూపాయలకు) పాడుకుని సంత వేలాన్ని దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించడం ద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని, పారదర్శక పద్ధతిలో ఈ వేలం పాటను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర నాగరాజు, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.