18 May, 2026 | 7:40 AM

వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

18-05-2026 12:00 AM

పట్టుబడ్డ -300 మందిపై కేసులు

శేరిలింగంపల్లి, మే 17 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామని సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ ట్రాఫిక్ జీ హన్మంతరావు తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 300 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. 253 ద్విచక్ర వాహనదారులు, 9 ఆటోలు, 38 కార్ల వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.

వీరిలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా పరీక్షలు చేయగా 232 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 35 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 33 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత -2023 లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష పదేళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.