19 July, 2026 | 12:06 PM

Breaking News

అక్రమంగా నిల్వ చేసిన 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత   •   ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో బస్వాపూర్ యువకుడి విజయం   •   శాకంబరీ దేవిగా '7'పాయల వనదుర్గమ్మ..   •   జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్.. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు   •   FIFA World Cup 2026: తుది అంకానికి FIFA సమరం   •   ప్రధాన రహదారిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లు.. ప్రాణాలకు ముప్పు రోడ్డుపక్కనే   •   Japan Open Badminton 2026: చరిత్ర సృష్టించిన పీవీ సింధు   •   విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. పల్నాడు వాసులు మృతి   •   బీఆర్ఎస్ కార్యక్రమానికి మల్లారెడ్డి డుమ్మా- సీఎం కార్యక్రమానికి హాజరు   •   విద్యార్థి ప్రతిభ.. పొడువును కొలిచే పరికరం..   •  

తూకాలు సకాలంలో పూర్తి చేయాలి

30-05-2026 12:42 AM

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్, మే 29(విజయ క్రాంతి): జిల్లాలోని మూడుచింతలపల్లి మండలం కొల్తూ రు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్  సుగుణా బాయి,జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి,  డిప్యూటీ తహసీల్దార్ భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రంలోని సౌకర్యాలను, ధాన్యం నాణ్యతను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకాలు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, కేంద్రానికి ధాన్యం తెచ్చే రైతులకు తాగునీరు,

నీడ వంటి కనీస వసతులు కల్పించాలని, తూకం వేసే ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా  చర్యలు తీసుకోవాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రైతులకు దక్కేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.