19 July, 2026 | 3:20 PM

బీఆర్ఎస్ కార్యక్రమానికి మల్లారెడ్డి డుమ్మా- సీఎం కార్యక్రమానికి హాజరు

19-07-2026 09:43 AM

మేడ్చల్, జూలై 19 (విజయక్రాంతి): మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medchal MLA Chamakura Malla Reddy) బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామానికి డుమ్మా కొట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. సరూర్ నగర్ లో యువ సంగ్రామం కార్యక్రమం(BRS Yuva Sangrama Sabha) జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మల్లారెడ్డి స్థానికంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మేడ్చల్ నియోజకవర్గం(Medchal Constituency) నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నగరంలోనే ఉదయం కేటీఆర్ పాల్గొన్న కార్యక్రమానికి హాజరుకాని మాజీ మంత్రి మల్లారెడ్డి సాయంత్రం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో జరిగిన సీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఘట్కేసర్ లో అందెశ్రీ స్మృతి వనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.